9న విశాఖకు సిఎం జగన్
విశాఖపట్టణం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవంబరు 9వ తేదీన విశాఖపట్టణం రానున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో 9వ తేదీన ఉదయం 11.50 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటారు.
అక్కడి నుండి మధ్యాహ్నం 12:05కు హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్టణం చేరుకుంటారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2.50 గంటలనుంచి 3.30 వరకు సిఎం ప్రోగ్రాం రిజర్వ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళ్లనున్నారు.