ఎపిని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న సిఎం జగన్
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/ys-jagan-750x313.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఇబి), అబ్కారి శాఖపై సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదకద్రవ్యాల వినియోగం ఉండకూడదని.. అక్రమ మద్యం, గంజాయి సాగుకు వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎపిని నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సిఎం ఆకాంక్షించారు.
నార్కొటిక్స్‌కు వ్యతిరేకంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో భారీ హోర్డింగ్స్ పెట్టాలని.. ఎస్ ఇబి టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని కోరారు.నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యం అరికట్టడం.. సచివాలయాల్లోని మహిళ పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం జగన్ ఆదేశించారు.