ప్రధానమంత్రి మోడీకి ఎపి సిఎం జగన్ లేఖ..
అమరావతి (CLiC2NEWS): ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఐఎఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై పంపాలనే కేంద్ర నిర్ణయాన్ని సిఎం స్వాగతించారు. రాష్ట్రాల్లో ఉన్న ఐఎఎస్ అధికారులను కేంద్ర సర్వీసుకు పంపడానికి ఇబ్బంది లేదని, కానీ ఎవర్ని పంపాలి అనే అంశంపై రాష్ట్రాలే నిర్ణయిస్తే బాగుంటుందని లేఖలో పేర్కొన్నారు. అధికారుల పనితీరు, సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికే తెలుస్తుంది కాబట్టి ఆ నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందని లేఖలో తెలిపారు.