వ్యోమగామి కలకు సిఎం జగన్ రూ.50లక్షల ఆర్ధికసాయం

పాలకొల్లు (CLiC2NEWS): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవికి సిఎం జగన్ రూ. 50లక్షల ఆర్థికసాయం మంజూరు చేశారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ మూడోసంవత్సరం చదువుతుంది. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతో నాసాతోపాటు పోలాండ్‌లో ఎనలాగ్ అస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకుంది. వ్యోమగామి అవ్వాలంటే అంతర్జాతీయ సంస్థలో పైలెట్‌గా శిక్షణ పొందాల్సిఉంది. దీనికోసం సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆర్ధిక సహాయం చేయవలసినదిగా కోరింది. ఒక నెలలోపే ఆమెకు కావలసిన ఆర్ధిక సాయం మంజూరు చేశారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ సచివాలయంలో జాహ్నవికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జాహ్నవి శిక్షణ విజయవంతంగా పూర్తి చేస్తానని, వ్యోమగామిగా దేశ కీర్తినపెంచేందుకు కష్టపడతానని తెలిపింది.