జలమండలిలో టిజిఓ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టిజిఓ) జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయడంతో పాటు సుమారు 250 మంది జలమండలి సిబ్బంది, కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టిజిఓ నాయకులు మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చిన సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందిస్తూ మరింత మేలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగలోకమంతా కష్టపడి పని చేస్తోందన్నారు.
టిజిఓ హైదరాబాద్ జిల్లా కోశాధికారి, టిజిఓ జలమండలి శాఖ అధ్యక్షులు ఎండీ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టిజిఓ హైదరాబాద్ అధ్యక్షులు ఎంబీ కృష్ణయాదవ్, కార్యదర్శి టి.హరికృష్ణ, అసోసియేట్ ప్రసిడెంట్ ఎన్.శ్రీనీష్, జలమండలి శాఖ కార్యదర్శి చంద్రజ్యోతి, హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు బి.స్వరూప, ఈసీ మెంబర్ జే.పూనమ్, కార్యనిర్వాహక కార్యదర్శి గోపిచంద్, జలమండలి శాఖ అసోసియేట్ ప్రసిడెంట్ పి.సంతోష్ కుమార్, సోషల్ వర్కర్ ఏవీ రావు, జలమండలి శాఖ అధ్యక్షులు మహేష్ కుమార్‌తో పాటు ఇతర నాయకులు, తదితరులు హాజరయ్యారు.