గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన సిఎం కెసిఆర్
గజ్వేల్ (CLiC2NEWS): బిఆర్ ఎస్ అధినేత సిఎం కెసిఆర్ గజ్వేల్‌లో గురువారం నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్, కామారెడ్డి నుండి కూడా కెసిఆర్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అనంతరం కామారెడ్డికి సిఎం కెసిఆర్ బయలు దేరనున్నారు. కామారెడ్డిలో మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. మరోవైపు మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ఆర్‌డిఒ ఆఫీస్‌లో కెటిఆర్.. సిద్దిపేటలో హరీశ్‌రావు నామినేషన్ పత్రాలు అందజేశారు.