పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన సిఎం కెసిఆర్
కొల్లాపూర్ (CLiC2NEWS): పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను సిఎం సాకారం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తొలి పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం జాతికి అంకితం చేశారు. డెలివరి సిస్టర్నః్ వద్ద సిఎం, మంత్రులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేదపండితులు పూజలు చేసి.. వాటిని పలు గ్రామాల సర్పంచ్‌లకు అంజేశారు. ఆ నీటితో పలు గ్రామాల్లోని దేవాలయాలలో ప్రజాప్రతినిధులు పూజలు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు తాగునీటిని అందించే లక్ష్మంతో నిర్మాణం చేపట్టారు. రూ. 35 వేల కోట్ల అంచనాతో ఎత్తిపోతల పథకానికి 2015లో సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో మునుగోడు నియోజక వర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు అందనుంది.
