బిఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. టిఆర్ ఎస్‌ను బిఆర్ ఎస్ గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసినదే. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఇవాళ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ కెసిఆర్ సంతకం చేశారు. సిఎం కెసిఆర్ సంతకం చేసిన లేఖను ఇసికి అధికారికంగా పంపనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.
Hi, Neat post. There is an issue along with your site in internet explorer, would check this?K IE still is the marketplace chief and a huge section of other people will miss your great writing due to this problem.