హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులకు సిఎం భూమిపూజ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నలుమూలలా.. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (టిమ్స్) ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అల్వాల్, గడ్డిఅన్నారుం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఈ మూడు టిమ్స్ ఆసుత్రులు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక్కోటిమ్స్‌ను 1000 పడకల సౌకర్యాంతో నిర్మించను్నారు. ప్రతి దవాఖానాలో 26 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసియు బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.
మూడు ఆసుపత్రుల వివరాలు..
ఎర్రగడ్డ టిమ్స్:
ఎర్రగడడ్లో నిర్మించనున్న ఆసుపత్రిని 17 ఎకరాల్లో జీ ప్లస్ 14 ఆంతస్తుల్లో ఏర్పాటు చేయనున్నారు. దీనిలో వెయ్యి పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. దీని నిర్మాణం కోసం రూ. 882 కోట్లు కేటాయించారు.
కొత్తపేట టిమ్స్:
జిప్లస్ 14 అంతస్తుల్లో కొత్తపేట టిమ్స్‌ను 21.36 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీనిలో వెయ్యి పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. దీని నిర్మాణం కోసం రూ. 900 కోట్లు కేటాయించారు.
అల్వాల్ టిమ్స్:
28.41 ఎకరాల్లో జిప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యిపడకల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 897 కోట్లు కేటాయించారు.