కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సిఎం కెసిఆర్ భేటీ
ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని అమిత్‌షాను కోరిన సిఎం కెసిఆర్.. మూడు రోజులుగా కొనసాగుతున్న ఢిల్లీ పర్యటన
న్యూఢిల్లీ(CLiC2NEWS): ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం కలిశారు. 2 రోజులుగా హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రధాన మంత్రి మోడీతె భూటీ అయిన విషయం తెలిసిందే. ఇవాళ (శనివారం) కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు. వారి భేటీ దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. సమావేశంలో ఐపీఎస్‌ల కేటాయింపుతో పాటు మరికొన్ని అంశాలను విన్నవించారు.

నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్‌పై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ వినతిపత్రం అందించారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని, ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగినట్లు వివరించారు. కొత్త 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కోరారు.