కేంద్రమంత్రి షెకావత్‌తో సిఎం కెసిఆర్ భేటీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ శ‌నివారం కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చ‌యి. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ అమ‌లు, పొరుగు రాష్ట్రాల‌తో జ‌ల వివాదాల‌కు సంబంధించిన విష‌యాల‌ను సిఎం కెసిఆర్ కేంద్ర మంత్రితో 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఐదు అంశాల‌తో కూడిన లేఖ‌ను షెకావ‌త్‌కు అందించారు. గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లు వాయిదా వేయాల‌ని సిఎం మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. కాగా నిన్న మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే.

Leave A Reply

Your email address will not be published.