2 గంట‌ల‌కు క‌లెక్ట‌ర్ల‌తో సిఎం కెసిఆర్ భేటీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఇవాళ (శ‌నివారం) మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశంలో ద‌ళిత బంధు, వ్య‌వ‌సాయం, ధాన్యం సేక‌ర‌ణ‌, కొవిడ్ ప‌రిస్థితి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించనున్నారు. ఇంకా యాసంగి పంట‌ల సాగు, జిల్లాల్లో చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌పై క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశ‌నం చేయ‌నున్నారు. ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయ అధికారులు కూడా పాల్గొననున్నారు.

Leave A Reply

Your email address will not be published.