యుసిసిపై సిఎం కెసిఆర్ కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉమ్మ‌డి పౌర‌స్మృతి యుసిసి బిల్లును వ్య‌తిరేఖిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్ఫ‌ష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేయాలుకున్న యుసిసి నిర్ణ‌యం దురుద్దేశంతో కూడుకున్న‌ద‌న్నారు. ప్ర‌త్యేక సంస్కృతి, సంప్ర‌దాయాలు కలిగి ఉన్న జాతులు, మ‌తాల‌కు ఇబ్బందిగా మారుతుంద‌ని సిఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌న‌దేశంఅలో భిన్న‌త్వంలో ఏక‌త్వం చాటుతూ యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలుస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ దేశాభివృద్ధిని విస్మ‌రించి విద్వేష రాజ‌కీయం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి.. ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెడుతుంద‌ని, ఇపుడు యుసిసి పేరుతో ప్ర‌జ‌లను విభ‌జించేందుకు కుట్ర ప‌న్నుతోంద‌ని మండిప‌డ్డారు. భార‌తీయుల ఐక‌మ‌త్యాన్ని చీల్చేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని సిఎం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కేంద్రం నిర్ణ‌యాల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు సిఎం తేల్చి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.