ఎయిర్ ఇండియాను అమ్మేశారు.. ఎల్ఐసిని కూడా అమ్మేస్తామని బడ్జెట్‌లో చెప్పారు: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సిఎం మీడియాతో మాట్లాడుతూ., కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందంలా ఉందని సిఎం అన్నారు. దేశాన్ని అమ్మేయడమే బిజెపి ప్రభుత్వానికి తెలుసని మండిపడ్డారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. ఎల్ ఐసిని కూడా అమ్మేస్తామని బడ్జెట్‌లోనే కేంద్రం స్పష్టం చేసింది. నష్టం వస్తే అమ్మాలి కానీ.. మంచి లాభాల్లో ఉన్న ఎల్ ఐసిని ఎందుకు అమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్న ఎల్ ఐసిని ఎందుకు అమ్ముతున్నారో ప్రధాని మోడీ ప్రజలకు చెప్పాలని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు.