పోడు భూములపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని పోడు భూముల సమస్య పరిష్కారంపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో అడవుల పరిరక్షణ, హరితహారంపై సమీక్షలో చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం.. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరితహారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా క్షేత్రస్థాయి పరిస్థితులపై సీఎంకు ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.