6న శాసనసభలో బడ్జెట్: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రసంగించిన విషయం తెలిసినదే. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం శనివారం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనికోసం ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అన్ని పక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ..బిఎసి సమావేశ నిర్ణయాలను సభ్యులకు వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 8వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుందని, వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. 9,10,11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్య, 12వ తేదీన ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగుతుందని వివరించారు. మిగిలిన విషయాలేమైన ఉంటే బిఎసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు.