దేశమంతా దళితబంధు అమలు చేయాల్సిందే.. సిఎం కెసిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/cm-kcr-in-mahabubabad.jpg)
ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మంలో నిర్వహించిన బిఆర్ ఎస్ తొలి బహిరంగ సభలో ముఖ్మమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అన్నారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందీ బిఆర్ ఎస్ పార్టీ అని.. బిఆర్ ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అంతేకాకుండా రైతు బంధు స్కీమ్ దేశమంతా అమలు
చేయాలన్నది బిఆర్ ఎస్ ఉద్దేశ్యమని తెలియజేశారు. దేశంలో 70వేల టిఎంసిల నీరు ఉండగా.. కేవలం 20వేల టిఎంసిలు మాత్రమే వినియోగంలో ఉందన్నారు. చైనాలో 5వేల టిఎంసిల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని.. మన దేశలంలో ఒక్క రిజర్వాయర్ ఉందా అని ప్రశ్నించారు. కెనడా నుండి కందిప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నింఆచరు. అంతేకాకుండా దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండగా.. 2.10 లక్షల మెగావాట్లకు మించి వాడుకోవడంలేదన్నారు. దేశానికి నిర్ధిష్ట లక్ష్యం లేదని.. బిఆర్ ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తామని కెసిఆర్ వివరించారు.
అదేవిధంగా దళిత బంధు దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 25 లక్షల కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. ఇంకా విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితులలోనూ ప్రైవేటుపరం కానివ్వమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ భహిరంగ సభలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు.