పోలీసు నియామక అర్హత పరీక్షల్లో తగ్గనున్న కటాఫ్ మార్కులు.. సిఎం కెసిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/cm-kcr-in-assebly.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పోలీసు నియామక పరీక్షల్లో ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ కీలక ప్రకటన చేశారు. పోలీసు నియామక అర్హత పరీక్షల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టి అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ పలు సంఘాల నుండి వస్తున్న డిమండ్‌లు వస్తున్నాయి. కటాఫ్ మార్కులు 20% వరకు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రకటన చేశారు.