600 కార్లు, 2 బస్సులు.. భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లారు. రెండు బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్ ప్రగతి భవన్ నుండి బయల్దేరి మహారాష్ట్రకు వెళ్లారు. బస్సులలో సిఎంతో పాటు మరి కొందరు మంత్రులు బస్సులలో ప్రయాణిస్తున్నారు. రెండు రోజుల పాటు మమారాష్ట్రలో సిఎం పర్యటన కొనసాగనుంది. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని పలువురు నేతలు బిఆర్ ఎస్‌లో చేరనున్నారు. సోలాపుర్ జిల్లాలో నిర్వహించే సభలో సిఎం ప్రసంగించనున్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తి పీఠం తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.