రోశ‌య్య భౌతిక కాయానికి సిఎం కెసిఆర్ నివాళి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశయ్య పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు నివాళుల‌ర్పించారు. హైద‌రాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న రోశ‌య్య నివాసానికి చేరుకున్న సిఎం.. రోశ‌య్య పార్థీవ దేహం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాలుల‌ర్పించారు. ఆయ‌న కుటుంభ స‌భ్యుల‌ను ఓదార్చారు. వారికి త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.


విలువ‌ల‌కు సంప్ర‌దాయాల‌కు రోశ‌య్య మారుపేరు`
రోశ‌య్య భౌతిక కాయానికి సిజెఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నివాళి..

రోశ‌య్య భౌతిక కాయానికి సిజెఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నివాళుల‌ర్పించారు.
రోశ‌య్య మ‌ర‌ణం తెలుగు ప్ర‌జ‌ల‌కు తీర‌ని ఆవేద‌న క‌లిగిస్తోంది. కార్య‌క‌ర్త స్థాయి నుంచి సిఎ, గ‌వ‌ర్న‌ర్ స్థాయి వ‌ర‌కూ ఆయ‌న చేశారు. ఆయ‌న మృతి తెలుగు ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు. విలువ‌ల‌కు సంప్ర‌దాయాల‌కు రోశ‌య్య మారుపేరు`
అని జ‌స్టిస్ ఎన్ వి ర‌మ‌ణ పేర్కొన్నారు.


ముఖ్య‌మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా అనేక ప‌ద‌వుల‌కు ఆయ‌న వ‌న్నె తెచ్చారు.
రోశ‌య్య హ‌ఠాన్మ‌ర‌ణం చ‌లా బాధాక‌రం.. ఆయ‌న‌తో నాకు చాలా ద‌గ్గ‌రి అనుబంధం ఉండేది. ప్ర‌తిప‌క్షాల‌ను మొప్పించ‌గ‌ల నేర్ప‌రి రోశ‌య్య‌. ముఖ్య‌మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా అనేక ప‌ద‌వుల‌కు ఆయ‌న వ‌న్నె తెచ్చారు.“ అని మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు.


స‌బ్జెక్ట్ ఏదైనా.. స‌మ‌స్య ఏదైనా అప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు..
రోశ‌య్య స‌మైఖ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనేక ప‌ద‌వులు అధిష్టించి వాటికి వ‌న్నె తెచ్చారు. శాస‌న‌స‌భ‌లో స‌బ్జెక్ట్ ఏదైనా.. స‌మ‌స్య ఏదైనా అప్ప‌టిక‌ప్పుడు స‌మాధానం చెప్ప‌గ‌ల నిష్ణాతుడు రోశ‌య్య‌. ఆయ‌న మృతి తెలుగు ప్ర‌జానికానికి తీర‌ని లోటు..“ అని మాజీ మంత్రి ఈట‌ల పేర్కొన్నారు.


రోశ‌య్య నుంచి చాలా నేర్చుకోవాలి..
రాజ‌కీయాల్లో రోశ‌య్య నుంచి చాలా విష‌యాలు నేర్చుకువాలి.. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చ‌లా బాధ‌క‌ర‌మైన విష‌యం“ అని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.