సాయిచంద్ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్ భావోద్వేగం

హైదరాబాద్ (CLiC2NEWS): ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. గుర్రంగూడలోని నివాసానికి వెళ్లి సాయిచంద్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ భావోద్వేగానికి గురయ్యారు. వారికి నేనున్నానంటూ సిఎం భరోసా ఇచ్చారు. సాయిచంద్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు.