ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం సిఎం కెసిఆర్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.