రేపు యాదాద్రికి వెళ్ల‌నున్న సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ రేపు (మంగ‌ళ‌వారం) యాదాద్రి ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ నుంచి ఉద‌యం 11:30 గంట‌ల‌కు యాదాద్రి బ‌య‌ల్దేర‌నున్నారు. యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యం పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న ప‌రిశీలించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి పునఃప్రారంభ తేదీల‌ను ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. అలాగే మ‌హాసుద‌ర్శ‌న యాగం వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.