సివిల్స్‌లో సత్తా చాటిన విద్యార్థులకు సిఎం కెసిఆర్ అభినందన
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/CM-KCR-IN-HYD.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సివిల్స్ విజేతలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందనలు తెలియజేశారు. సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. మూడో ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన ఉమా హారతితో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ కెసిఆర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉమా హారతిని అభినందించారు.