ఢిల్లీ స్త్రీ శిశు అభివృద్ది శాఖలో సీనియర్ అధికారిపై సస్పెన్షన్ వేటు
స్నేహితుడి కుమార్తె అనే కనికరం కూడా లేకుండా..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/minor-girl-rape-case.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): మైనర్ బాలికపై అత్యచారానికి పాల్పడిన సీనియర్ అధికారిపై సస్పెన్ష్ వేటు పడింది. స్త్రీ శిశు అభివృద్ది శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి తన స్నేహితుడి మరణానంతరం అతని కుమార్తె బాగోగులు చూసుకొంటానని ముందుకొచ్చాడు. కొన్నేళ్లు వారి మధ్య స్నేహం ఉండటంతో మైనర్ కుమార్తెను అధికారితో పంపడానికి తల్లి కూడా సమ్మతించింది. ఇంటికి తీసుకెళ్లిన బాలికపై అధికారి కొన్ని నెలలపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అధికారి భార్య ఈ విషయం బయటకు తెలియకుండా గర్భవిచ్చితి మాత్రలు మింగించింది. అస్వస్థతతో బాధపడుతున్నబాలికను తల్లి ఇంటికి తీసుకెళ్లింది. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసుపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం స్పందించారు. అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఐదు గంటలలోపు చీఫ్ సెక్రటరీ నివేదిక సమర్పించనున్నారు. అతనిని ఎందుకు అరెస్ట్ చేయలేదని..కఠిన శిక్ష పడాలని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతిమాలివాల్ కూడా అధికారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.