గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం శంక‌స్థాప‌న‌

గండిపేట (CLiC2NEWS): మూసీ పున‌రుజ్జీవ‌నంలో భాగంగా ఉస్మాన్ సాగ‌ర్ వ‌ద్ద గోదావ‌రి తాగునీటి స‌ర‌ఫ‌రా పథ‌కం ఫేజ్ 2,3 ప్రాజెక్టు ప‌నుల‌కు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. రూ.7,360 కోట్ల‌తో రెండేళ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డానికి గోదావ‌రి తాగునీటి ప‌థ‌కం తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌ర తాగునీటి స‌మ‌స్య మాత్ర‌మే కాకుండా , న‌ల్గొండ ఫ్లోరైట్ స‌మ‌స్య కూడా తీర‌నుందన్నారు. న‌ల్గొండ జిల్లాలో పాద‌యాత్ర చేసిన‌పుడు మూసీని ప్ర‌క్షాళ‌న‌చేయాల‌ని ప్ర‌జ‌లు చెప్పార‌ని, దీనికి స‌మ‌స్య‌లు ఎదురైనా ముందుకెళుతున్నామ‌ని తెలిపారు. తాగు నీరు స‌మ‌స్య తీర్చేందుకు ఎవ‌రు అడ్డువ‌చ్చినా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌న్నారు.

 

బిజెపి నూత‌న‌ తెలంగాణ రాష్ట్ర క‌మిటి

 

Leave A Reply

Your email address will not be published.