ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సిఎం శంకుస్థాపన
హైదరాబాద్ (CLiC2NEWS): కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవన నిర్మాణం రూపుదిద్దుకోనున్నది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , ఇతర మంత్రులతో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సిఎం భూమి పూజ చేశారు. ప్రస్తుత ఆసుపత్రి అప్జల్‌గంజ్‌లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు.
నూతనంగా నిర్మించబోతున్న ఉస్మానియా ఆసుపత్రి రాబోయే వందేళ్ల అవసరాకలు తగినట్లు తీర్చిదిద్దనున్నారు. భవన నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు నుండి 2,700 వరకు ఖర్చు అవుతుందని సమాచారం. అన్ని రకాల సూపర్ స్పెషాలిటి వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసియు వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.