పలు జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సిఎం ఆదేశం

హైదరాబాద్ (CLiC2NEWS): అర్హులైనవారందరికీ రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమలులో లేని పలు జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కొత్త వారితో పాటు పాత కార్డులు వారు కూడా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేశారు.
పౌర సరఫరాల శాఖధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డు జారీకి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సభ్యులను చేర్చేందుకు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎం సూచించారు.