తెలంగాణ రైతన్నలకు శుభవార్త..
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిఎం ఆదేశాలు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తనందించింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 7వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారలకు సిఎం సూచనలు ఇచ్చారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. గ్రేడ్ వన్‌కు రూ. 2,060, సాధారణ రకానికి రూ. 2,040గా ధరను ప్రభుత్వం ప్రకటించింది.