యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి (CLiC2NEWS): మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పోలీసులు, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పిఎఫ్ ఉద్యోగుల పిల్లలకు ఇక్కడ అంతార్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యాను అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీథర్‌బాబు అన్నారు.