నేను ఎవరి వెనుకా లేను, ప్రజల వెంట మాత్రమే ఉంటా.. సిఎం రేవంత్
హైదరాబాద్ (CLiC2NEWS): మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు స్పందనగా.. మీ కుటంబ పంచాయితీ మధ్యకు మమ్మల్ని తీసుకురావద్దని , నేను ఎవరి వెనుకాల లేను.. కేవలం ప్రజల వెంట మాత్రమే ఉంటానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ ఎస్ పార్టి నుండి సస్సెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో హారీశ్ రావు వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
బిఆర్ ఎస్ నేతలను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని సిఎం అన్నారు. అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానన్నారు. కవిత వెనుక ఉన్నానని కొందరు, హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకాల లేను, ప్రజలు తిరస్కరించిన వారి వెనుక నేనుందుకుంటానన్నారు. అలాంటి వారిని కలిసే సమయం కూడా తనకు లేదని సిఎం అన్నారు.
[…] Also Read : నేను ఎవరి వెనుకా లేను, ప్రజల వెంట మ… […]