కవులు, కళాకారులు కలాలకు పదును పెట్టండి: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్-2024 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడారు. ఇలాంటి పుస్తక ప్రదర్శన మన చరిత్రను భవిష్యత్ తరాలకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందిన.. నిజమైన చరిత్రను భావితరాలకు అందించే ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, బుక్ ఫెయిర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలను విప్పాల్సిన అవసరం ఉందని సిం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కవులు, కళాకారులు మనకు స్ఫూర్తి నిచ్చారన్నారు. మలిదశ ఉద్యమంలో అందెశ్రీ , గద్దర్ , గోరటి వెంకన్న , బండి యాదగిరి, గూడ అంజయ్య లాంటి ఎంతో మంది కవులు వారి సాహిత్యం ద్వారా పోరాటాలను నర్మించడమే కాకుండా మాలాంటి వారు వేదికలపై మాట్లాడేందుఉ ఎంతో స్ఫూర్తినిచ్చారు. చరిత్రలో ఎపుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఉంటోందని, పోరాటంలో అమరులైన వారి గురించి కొంత నిర్లక్ష్యం, సమాచార లోపం ఉంటుందన్నారు. అది.. సాయుధ రైతాంగ పోరాటమైనా, తొలి, మలి తెలంగాణ ఉద్యమమైనా .. సమిధలైన, అమరులైన వారి చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు. చరిత్ర కారులు వాస్తవాలను లిఖించకపోతే వారికి అన్యాయం జరగడంతో పాటు, సమాజానికి అసంపూర్తి సమాచారం అందుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.