ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినా కొన్ని కారణాలు వలన నిలిచిపోయింది. నేడు ముఖ్యమంత్రి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. జూపార్కు నుండి ఆరాంఘర్ వరకు 4 కిలోమీటర్ల పొడవునా సుమారు రూ.8ంం కోట్లతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఈ పై వంతెనతో హైదరాబాద్ నుండి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్మాణం చేపట్టారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన ఒకటి. ఇది నగరంలో రెండో అతిపెద్ద వంతెన. దీని పొడవు 4.08 కిలోమీటర్లు. ఈ వంతెనను దాదాపు రూ.800 కోట్లతో నిర్మించారు. బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని ఈ ఫ్లైఓవర్ తో నివారించేందుకు ఈ నిర్మాణం చేపట్టారు.
తప్పక చదవండి: రేపు ‘ఆరాంఘర్-జూపార్క్’ ఫ్లైఓవర్ ఓపెనింగ్..