స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డి

మీర్‌ఖాన్‌పేట (CLiC2NEWS): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటి ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో వర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో ఈ నిర్మాణం జరగనుంది. దీంతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజి సెంటర్, ప్రైమరి హల్త్ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు. సిఎం .. డిప్యూటి సిఎం, భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లతో కలిపి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.