ప్రధాని మోడికి సిఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి సోమవారం లేఖ రాశారు. ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని పలు పార్టి ప్రతినిధులతో వచ్చి కలిసేందుకు సమయం ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకొచ్చిన రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. బిసి రిజర్వేషన్ల పెంపు విషయాన్ని సిఎం లేఖలో ప్రస్తావించారు. ఆ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలని పేర్కొన్నారు.