Delhi: కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన సిఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఆయనతో పాటు లోక్సభ ఎంపిలు మల్లు రవి, రఘురామిరెడ్డి, బలరాం నాయక్ , కడియం కావ్య, గడ్డం వంశీ, సురేష్ షెట్కర్, చామల కిరణ్ కుమార్రెడ్డి, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సిఎం రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమవనున్నారు. దీంతోపాటు మంత్రిమండలి విస్తరణ , పిసిసి అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.