కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే మాటే లేదు.. సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): మొదటి నుండి ప్రధాని మోడీ తెలంగాణ పట్ల కక్ష కట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని, బడ్జెట్లో తెలంగాన అనే పదాన్నే నిషేధించారన్నారు. మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు ఢిల్లీ వెళ్లారని, తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు. కానీ , తెలంగాణ పట్ల కక్ష కట్టారన్నారు. ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఏ రంగానికిఈ సహకారం అందించలేదు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదిన మోడీ భావిస్తున్నట్లున్నారన్నారు. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించలన్నారు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇవ్వడం వల్లే మోడీ ప్రధాని కుర్చీలో కూర్చున్నారన్నారు.
ఎపికి నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని సిఎం ప్రశ్నించారు. విభజన చట్టం కేవలం ఎపికే కాదు. తెలంగాణకే వర్తిస్తుంది. పోలవరంకు నిధులు ఇచ్చిన కేంద్రం.. పాలమూరు–రంగారెడ్డికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో నిరసనకు తెలంగాణ బిజెపి ఎంపిలు కలిసి రావాలన్నారు.