తెలంగాణ‌ను అప్పుల ఊబిలోకి నెట్టారు: సిఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రాన్ని బిఆర్ ఎస్ నేత కెసిఆర్‌ రూ. 7 ల‌క్ష‌ల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సింగ‌రేణి కార్మికుల‌కు రూ. కోటి ప్ర‌మాద బీమా ప‌థ‌కాన్ని సిఎం స‌చివాల‌యంలో ప్రారంభించారు. ఎంఒయుపై సింగ‌రేణి సిఎండి బ‌ల‌రాం, బ్యాంక‌ర్లు సంత‌కాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ..తెలంగాణ‌ను కెసిఆర్ దివాలా తీయించార‌న్నారు. దీనివ‌ల్ల ఏటా వ‌డ్డీల‌కే రూ. 70 వేల కోట్లు చెల్లించాల్సి వ‌స్తోంద‌న్నారు.

అదేవిధంగా మోడీని ఎందుకు గెలిపించాలో కిష‌న్ రెడ్డి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మ‌ద్ద‌తు ధ‌ర అడుగుతున్న రైతుల‌ను చంపుతున్నందుకు మ‌ళ్లీ గెలిపించాలా అని ప్ర‌శ్నించారు. వ‌ర‌ద‌లు వ‌చ్చి హైద‌రాద్ న‌ష్ట‌పోతే.. కిష‌న్ రెడ్డి కేంద్ర నిధులు ఏమైనా తెచ్చారా.. అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your email address will not be published.