న్యూయార్క్, టోక్యో రీతిలో హైద‌రాబాద్ అభివృద్ధి: సిఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న్యూయార్క్‌, టోక్యో త‌ర‌హాలో ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాల్లో భాగంగా న‌గ‌రంలో నిర్వ‌హించిన రైజింగ్ వేడుక‌ల్లో సిఎం మాట్లాడారు. హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర స‌ర్కార్ కృషి చేస్తోంద‌న్నారు. న‌గ‌రంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.7వేల కోట్ల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టిన‌ట్లు సిఎం తెలిపారు.

రీజిన‌ల్ రింగ్ రోడ్డు తెలంగాణ‌కే మ‌ణిహార‌మ‌ని సిఎం అన్నారు. రూ.35వేల కోట్ల‌తో 360కి.మీ రిజిన‌ల్ రింగ్ రోడ్డుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని.. ఓఆర్ ఆర్‌కు అనుబంధంగా ముచ్చ‌ర్ల ప్రాంతంలో ప్యూచ‌ర్ సిటి నిర్మిస్తామ‌ని తెలిపారు. 40 నుండి 50 వేల ఎక‌రాల్లో అద్భుతంగా ప్యూచ‌ర్ సిటి ఉండ‌బోతుంద‌ని.. టోక్యో, న్యూయార్క్‌తో పోటీ ప‌డేలా నిర్మిస్తామ‌ని, దీనికి రూ.ల‌క్ష‌న్న‌ర కోట్లు ఖ‌ర్చు పెడితే హైదరాబాద్ అద్భుత న‌గ‌రం అవుతుంద‌ని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.