తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు 18 గంటలు పనిచేయాల్సిందే. సిఎం రేవంత్
హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని బసవతారకం ఆసుపత్రి వార్షికోత్సవంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని, నిస్వార్ధంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారన్నారు. ఎపి సిఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని , ఆయన 18 గంటలు పనిచేసి.. తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాలన్నారు. అభివృద్దిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నామని సిఎం తెలిపారు.
ఈ సందర్బంగా బసవతారకం ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సిఎం రేవంత్ రెడ్డి సహకారం కోరగా.. ఆయన అంగీకరించారన్నారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్తాయికి చేరుకుందని.. సేవలను మరింత విస్తరించాలన్నారు.