త్వ‌ర‌లో గ్రూప్‌-1 ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందజేస్తాం.. సిఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో త్వ‌ర‌లో గ్రూప్‌-1 ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 563 మంది గ్రూప్‌-1 అధికారుల‌ను తెలంగాణ నిర్మాణంలో భాగ‌స్మాముల‌ను చేయ‌బోతున్నామ‌న్నారు. చిన్న ఆరోప‌ణ కూడా లేకుండా టిజిపిఎస్‌సి ప‌నిచేస్తోంద‌ని సిఎం తెలిపారు. ప్ర‌జాపాల‌న – ప్ర‌జా విజ‌యోత్స‌వాల్లో భాగంగా హెచ్ ఎండిఎ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించిన ఆరోగ్య ఉత్స‌వాల్లో పాల్గొన్న సిఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త విద్య‌, వైద్యం అని, దేశంలోనే అత్య‌ధిక డాక్ట‌ర్ల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌న్నారు. బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎనిమిది వైద్య క‌ళాశాల‌లు ఇచ్చి ఎలాంటి వ‌స‌తులూ క‌ల్పించ‌లేద‌న్నారు. ఒక్క ఏడ‌దిలోనే 14 వేల మందిని వైద్యారోగ్య‌శాఖ‌లో నియ‌మించ‌డం ఒక చ‌రిత్ర‌న్నారు. మొత్తం 6,500 మందిని వైద్యారోగ్య‌శాఖ‌లో నియ‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.