డిఎస్‌సి విజేతలను చూస్తే.. దసరా ముందే వచ్చినట్లుంది: సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): డిఎస్‌సి విజేతలను చూస్తుంటే దసరా ముందే వచ్చినట్లు ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్‌బి స్టేడియంలో డిఎస్ సి విజేతలకు సిఎం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. టీచర్లే తెలంగాణ వారధులు, నిర్మాతలని, పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చి దిద్దే బాధ్యత వారిదేనని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశామని , 65 రోజుల్లో డిఎస్‌సి నియామక ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు.