ఫార్ములా-ఇ కార్ రేసింగ్‌పై ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధం: సిఎం
హైదరాబాద్ (CLiC2NEWS): ఫార్ములా-ఇ కార్ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమని.. అవసరమైతే బిఆర్ ఎస్ కార్యాలయానికి వెళ్లి అయినా చర్చిస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి.. రూ.600 కోట్లు పెండింగ్ నిధులు రావాలని అడిగారని సిఎం తెలిపారు. అసెంబ్లీలో సిఎం మాట్లాడుతూ.. తాను ఒకే అంటే మళ్లీ రేసింగ్ నిర్వహిస్తామని ఇ కార్ రేస్ ప్రతినిధులు చెప్పినట్లు సిఎం తెలిపారు. వారికి రావల్సిన పెండింగ్ నిధులు ఇవ్వమని అడిగారు. వారు వచ్చి కలిసిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సిఎం తెలిపారు.
రూ.55 కోట్లు చిన్న విషయం కాదని సిఎం అన్నారు. ఫార్ములా -ఇ కార్ రేసింగ్‌పై సభలో చర్చించాలని కెటిఆర్ ఇంతకాలం ఎందుకు అడగలేదని సిఎం ప్రశ్నించారు. హెచ్ ఎండిఎ ఖాతాలోని రూ.కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. ఎఫ్ఇఒ ప్రతినిధులతో కెటిఆర్ కుదుర్చుకున్న ఒప్పందం రూ.600 కోట్ల.. మిగతా డబ్బుకోసం వారు వచ్చినపుడు ఈ విషయం బయటపడిందన్నారు. తాను జాగ్రత్త పడటం వలన రూ.450 కోట్లు మిగిలాయన్నారు. ఈ కేసుపై ఎసిబి విచారణ జరుగుతోందని, న్యాయస్థానంలో కెసిఆర్ వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ విషయాలు వెల్లడించలేనన్నారు.