కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారు: సిఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో నిర్వహించిన క్షత్రియ సేవా సమితి అభినందన సభలో సిఎం మాట్లాడుతూ.. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎక్కడైనా విజయవంతమవుతారని.. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని సిఎం అన్నారు. ఈ సందర్బంగా దివంగత సినీనటుడు కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని సిఎం గుర్తుచేసుకున్నారు.కృష్ణం రాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమని .. అయన మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
కార్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నాకంటే గొప్పవారు వేదిక ముందు వినయంగా ఉన్నారని.. అది క్షత్రియుల గొప్పతనమన్నారు. రాజులను చట్ట సభల్లోకి తీసుకోవాలనే ఆలోచన ఉందని, ముందుగా పార్టీలో అవకాశం ఇస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాటిస్తున్నానన్నారు. క్షత్రియుల భవన్కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని.. మళ్లీ క్షత్రియ భవన్లో కలుద్దామని సిఎం అన్నారు.