మెట్రోను ఎల్‌బిన‌గ‌ర్ నుండి హ‌య‌త్‌న‌గ‌ర్ వ‌ర‌కు విస్త‌రిస్తాం: సిఎం రేవంత్

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎల్‌బిన‌గ‌ర్ నుండి శంషాబాద్ వ‌ర‌కు మెట్రో రాబోతుంద‌ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్‌బిన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గంలోని బైరామల్‌గూడ జంక్ష‌న్‌లో రూ. 148.05 కోట్ల‌తో నిర్మించిన లెవ‌ల్ -2 ప్లైఓవ‌ర్‌ను శ‌నివారం ఆచ‌ప ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ.. ఎల్‌బిన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గం నాకు 30 వేల మెజారిటీతో గెలిపించార‌ని.. ఇక్క‌డ ప్ర‌జ‌లు నా బంధువ‌లు, ఆత్మీయులేనన్నారు. మెట్రో రైలును విస్త‌రిస్తామ‌ని, ఎల్‌బిన‌గ‌ర్ నుండి హ‌య‌త్ న‌గ‌ర్ వ‌ర‌కు తీసుకెళ్తామ‌ని తెలిపారు. పాత‌బ‌స్తీ మెట్రోను ఆపాల‌ని ఎవ‌రో ఢిల్లీకి లేఖ‌రాశార‌ని.. అభివృద్ధిని అడ్డుకుంటే వారికి న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ఈ ప్లైఓవ‌ర్ ప్రారంభంతో బైరామ‌ల్‌గూడ కూడ‌లి సిగ్న‌ల్ ఫ్రీగా మారింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఓవైసి అసుప‌త్రి వైపు నుండి నాగార్జున సాగ‌ర్‌, విజ‌య‌వాడ వైపు వెళ్లే వాహ‌నాల‌కు ఈ వంతెన ఉప‌యోగ‌ప‌డుతుంది. కూడ‌లిలో వై ఆకారంలో విడిపోతుంది.

Leave A Reply

Your email address will not be published.