షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తా.. సిఎం రేవంత్‌రెడ్డి

మంగళగిరి (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఎస్ ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం మంగళగిరి సికె కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వైఎస్ ఆర్ జయంతి వేడుకలకు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ ను కుటుంబసభ్యుడిగా భావిస్తామని, ఏళ్లు గడిచినా ఆయనను మరిచిపోలేమన్నారు. శాసనమండలిలో మాట్లాడినపుడు ప్రోత్సాహించారని, ఏ పదవీ రాకున్నా పార్టిని వీడలేదన్నారు. ప్రతిపక్ష సభ్యుతల విషయంలో కూడా వైఎస్ ఆర్ ఎంతో ఉదారంగా ఉండేవారన్నారు. ప్రస్తుతం షర్మిల ప్రతిపక్ష పాత్రే పోషిస్తుందన్నారు. కడప ఎంపి సీటుక ఉప ఎన్నిక వస్తే.. షర్మిలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని, షర్మిలకు మద్దతుగా కడపలో ప్రచారం చేస్తానని సిఎం వెల్లడించారు.