ఆసిఫాబాద్ మెడికల్ కాలేజికి కొండా లక్ష్మణ్ బాపూజి పేరు: సిఎం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజి ఎన్నో త్యాగాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సిఎం పాల్గొన్నారు . ఈసందర్బంగా మాట్లాడుతూ.. రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామన్నారు. నేతన్నలకు ప్రభుత్వ ఆర్దర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండొద్దని భావించానని.. అందుకే , మహిళా సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తానే స్వయంగా 1.30 కోట్ల చీరలు ఆర్డర్లు నేతన్నకు ఇస్తున్నానన్నారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజికి కొండా లక్ష్మణ్ బాపూజి పేరు పెట్టనున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్ వర్సిటి ఏర్పాటు చేసి దానికి ఆయన పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు.