యాదాద్రి, భద్రాద్రిలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

భద్రాద్రి (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మి నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం సీతారమాస్వామి దేవాలయానికి వెళ్ళారు. సీతారామ చంద్రమూర్తి దర్శనం చేసుకొని పట్లువస్త్రాలు సమర్పించారు. సిఎం తో పాటు రాష్ట్ర మంత్రులు భట్టి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
