సిఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): అదానీ ప్ర‌క‌టించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీక‌రించ‌రాద‌ని ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకంది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటి నిర్మాణానికి అదాని గ్రూప్ ఇటీవ‌ల రూ.100 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అదానీ గ్రూప్‌పై వ‌స్తున్న‌ విమర్శ‌ల నేప‌థ్యంలో విరాళాన్ని తీసుకోవ‌డం లేద‌ని సిఎం రేవంత్ రెడ్డి మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ మేర‌కు అదానీ గ్రూపున‌కు లేఖ పంపిన‌ట్లు తెలిపారు. అదానీ నుండి రాష్ట్రప్ర‌భుత్వం నిధులు స్వీక‌రించింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని.. రాజ్యాంగ, చ‌ట్ట‌బ‌ద్ధంగానే అదానీ నుండి పెట్టుబ‌డులు అనుమ‌తిస్తామ‌న్నారు. ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల‌కు సాంకేతిక నైపుణ్యం నేర్పించే ల‌క్ష్యంతో స్కిల్స్ వ‌ర్సిటి ప్రారంభించామ‌ని.. ఈ వ‌ర్సిటీ వివాదాల‌కు లోను కావ‌డం ఇష్టం లేద‌న్నారు. అదానీ నుండి వ‌ర్సిటీకి వ‌చ్చిన విరాళం .. సిఎం, మంత్రుల‌కు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, తెలంగాణ ప్ర‌భుత్వ ఖాతాల్లోకి ఎవ‌రీ నుండి డబ్బులు రాలేద‌ని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.