ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే అధికారంలోకి కాంగ్రెస్: సిఎం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బాగ్‌లింగంపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేకు సిఎం రేవంత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. గడ్డం వివేక్, వినోద్‌లను చూస్తే రామాయణంలోని లవకుశలు గుర్తుకొస్తున్నారన్నారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కేంద్ర మాజి మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకాది)ది అని అన్నారు. దేశ నిర్మాణంలో ఆయన తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వారం , నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామననారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని, ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని రేవంత్ తెలపారు.